మలబద్ధకం నివారణకు ఏం చేయాలి?
మలబద్ధకం నివారణకు ఏం చేయాలి?
వాము ఆకు
వాము ఆకు మొక్క మనందరికీ చాలా మందికి తెలుసు. సాధారణంగా ప్రతి ఇంటి పెరట్లో కనిపిస్తుంది. వాము ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వామాకు తింటే జీర్ణ సమస్యలు, అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు దూరమవుతాయి. వామాకు జీవక్రియను మెరుగుపరుస్తుంది.
తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటే.. వామాకు మీకు మంచి ఆప్షన్.
ఒకటి లేదా రెండు ఆకులు కోసి తింటే చాలు.. మీకు కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. వామాకులో ఎ, బీ, సీ విటమిన్లు, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, క్యాల్షియం ఉన్నాయి.
పుదీనా
ప్రతి రోజూ ఉదయం పుదీనా ఆకులు, పుదీనా టీ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.
పుదీనా కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలకు తక్షణ ఉపశమనం ఇస్తుంది. కడపు నొప్పిని తగ్గించే శక్తి పుదీనాలో ఉంది.
పుదీనా ఆకులను తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.
పుదీనాలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. కాల్షియం, ఫాస్ఫరస్,విటమిన్ సీ, డీ, ఈ, బీ లు పుష్కలంగా ఉంటాయి.
కరివేపాకు
చాలా మంది కూరల్లో కరివేపాకు కనిపిస్తే తీసి పక్కన పెట్టేస్తారు. కానీ కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కరివేపాకును ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
కరివేపాకు జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్స్‌ను ప్రేరేపిస్తుంది, పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.
కరివేపాకు తింటే.. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకమూ కడుపు ఉబ్బరానికి ఓ కారణం.
అలాగే భోజనం తర్వాత కరివేపాకు కొద్దిగా తీసుకుని బాగా నమిలి మింగేస్తే అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
నేరేడు ఆకులు
నేరేడు ఆకుల్లో జీర్ణక్రియ గుణాలు మెండుగా ఉన్నాయి. అన్ని జీర్ణ క్రియ సమస్యలకు గొప్ప ఔషధంగా పని చేస్తుంది.
ఇందులో ఉండే యాంటీ ఫ్లాట్యులెంట్ లక్షణాలు అలిమెంటరీ కెనాల్‌లోని గ్యాస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
తద్వారా గ్యాస్ సమస్య, మలబద్ధకం, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో యాంటాసిడ్ లక్షణాలు ఉన్నాయి.
నేరేడు ఆకులు తింటే.. కడుపులో యాసిడ్ ఎక్కువగా పేరుకోకుండా చేస్తుంది. తద్వారా అజీర్తి, అల్సర్, గ్యాస్ట్రిటిస్ సమస్యకు చికిత్స చేస్తుంది.
సోంపు ఆకులు
సోంపు ఆకులు తీసుకున్నా.. కడుపు ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి అనేక జీర్ణ వ్యవస్థ సమస్యలకు సోంపు ఆకులు చాలా బాగా పనిచేస్తాయి.
సోంపు ఆకులను నమలడం వల్ల అల్సర్లు రాకుండా ఉంటాయి. గ్యాస్ సమస్య తగ్గుతుంది.
రోజూ సోంపు ఆకు తింటే.. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తినడం వల్ల కూడా కడుపుబ్బరం రాకుండా ఉంటుంది.
వేసవిలో కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువగా ఉంటుంది.
శరీరంలో సోడియం స్థాయులు పెరిగినా, డీహైడ్రేషన్‌కి గురైనా, టీ-కాఫీలు ఎక్కువగా తాగినా కడుపుబ్బరం బారిన పడే అవకాశాలెక్కువ.
కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగితే మంచిది.. వంటల్లో ఉప్పు తగ్గిస్తే.. మంచిదంటున్నారు నిపుణులు.
వేసవిలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతాం. కూల్ డ్రింక్ ఎక్కువగా తాగినా.. కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది.
కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ తాగాలనిపిస్తే తక్కువగా తాగండి
కొంతమందికి మైదాతో చేసిన పాస్తా, వైట్ బ్రెడ్ వంటివి తీసుకున్నప్పుడు కూడా కడుపుబ్బరానికి గురవుతుంటారు. కాబట్టి ఈ పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిది.