ఏనాడైనను వినయము

ఏనాడైనను వినయము
మానకుమీ మత్సరమున మనుజేశులతో
బూనకు మసమ్మతము బహు
మానమునను బొందు మిదియె మతము కుమారా!

తాత్పర్యం:

ఎంతటి వారికైనా సరే, వినయాన్ని మించిన ఆభరణం ఉండదు. ఈర్ష, అసూయలతో ఎవరితోనూ కలహాలకు దిగరాదు.

పేదవారి కోపం పెదవికి చేటు కదా. దీనిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు, మనకంటే పైవారితో వ్యవహారం నడిపేటప్పుడు ఎప్పటికీ వినయాన్ని వీడకూడదు.

ఇంకా, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదప్రతివాదనలు చేయకూడదు. ఇలా మెలకువతో మెలిగితేనే గౌరవ మర్యాదలు పొందగలం.

 

HOME

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *