ఉగాది అంటే
ఉగాది అంటే: చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాలని నమ్ముతారు.
సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స అవతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి.
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు.
అంటే కాలగనాన్ని, గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్షాధికులకు బ్రహ్మదేవుడు ఈరోజు వర్తింప చేస్తాడని నమ్మకం.
అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈరోజు నుంచే ప్రారంభమవుతుంద.
అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.
శాలివాహనుడు పట్టాభిశక్తుడైన ఈరోజు ప్రశస్తంలోకి వచ్చిందని మరో గాధ ఉంది.
ఉగాది, యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి.
ఉగాదిలో ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది…
యుగం అనగా ‘ద్వయం; లేదా ‘జంట’ అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది…
తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది…
వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగ..
ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక…