Uses of saltwater

Uses of saltwater

Uses of saltwater: శారీరక శుభ్రత కోసం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మానసిక ఉత్తేజం కలుగుతుంది. అయితే, ఈ స్నానం మంచినీటితో చేస్తారు. అదే ఉప్పునీటితో స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా, స్నానం చేసే నీటిలో కాస్తంత ఉప్పు వేసుకున్నట్టయితే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

* ఉప్పు నీటితో స్నానం చేస్తే చర్మంపై మచ్చలు తొలగిపోతాయి.

* కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* ఉప్పు కలిపిన నీటితో సున్నితంగా శరీరాన్ని మర్దనా చేసుకుంటే రక్తప్రసరణ తీరు మెరుగవుతుంది.

* ఉప్పులోని సహజ సిద్ధమైన ఖనిజాలు, పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి.

* చర్మంపై పగుళ్లు, మచ్చలు,నలుపుదనం తొలగిపోయి మంచి నిగారింపు వస్తుంది.

* ఉప్పు నీటి వల్ల పాదాలు, చేతి వేళ్ల మధ్య మురికిదనం తొలగిపోతుంది.

* టాక్సిన్లు, బ్యాక్టీరియా బారి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే ఉప్పు నీటితో స్నానం చేస్తుండాలి.

* చర్మం ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా ఉండేలా ఉప్పులోని ఖనిజాలు దోహదపడతాయి.

* చర్మం ముడతలు పడుతుంటే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారు ఉప్పునీటితో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

* చర్మంపై పుళ్లు, పొలుసులు, ఒరిసిపోవడం ఉంటే ఉప్పునీటితో కడిగితే సాంత్వన లభిస్తుంది.

* చర్మ సంబంధమైన సమస్యలనే కాదు, ఆస్టియో ఆర్థరైటిస్, వాపులను కూడా నివారించేందుకు ఉప్పు నీటితో స్నానం చేయడం మంచిది.

 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *