TS పాలిసెట్ దరఖాస్తు ప్రక్రియ, చివరితేది ఎప్పుడంటే?
TS పాలిసెట్ దరఖాస్తు ప్రక్రియ, చివరితేది ఎప్పుడంటే? : తెలంగాణలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 15న విడుదలైన సంగతి తెలిసిందే.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉండగా.. అనివార్యకారణాల వల్ల ప్రారంభంకాలేదు.
ఫిబ్రవరి 28 నుంచి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
అయితే రూ.100 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.300 తత్కాల్ ఫీజు కింద ఏప్రిల్ 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
ఈ ఏడాది మే 17న టీఎస్ పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈ ఏడాది మే 17న టీఎస్ పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: polycet-te@telangana.gov.in లేదా 040 -23222192 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.