సైన్స్ ఉపాద్యాయులు అందరికీ NATIONAL SCIENCE DAY శుభాకాంక్షలు మరియు శాస్త్రవేత్త లందరికీ పేరు పేరున పాదాభివందనాలు..
ఈ సందర్బంగా మనలో మన మాట..
మనలో 80% మందిమి మనసులో మూఢ విశ్వాసాలు నింపుకుంటు సమాజానికి సైన్స్ ను బోధిస్తూ ఉన్నాము అని నా అభిప్రాయం. మన సైన్స్ వాస్తవాలు చెప్పి ఉండకపోతే ఈ సరికే ఇప్పుడున్న దేవుళ్ళకు పది రెట్లు కొత్త దేవుళ్ళు పుట్టి ఉండేవారు.. ఊహించిన ప్రతి చోట మరికొన్ని కొత్త కథలు ఎన్నో అల్లేసి వారు.. గెలీలియో చెప్పినంత వరకూ సూర్యుడు నక్షత్రాలు కూడా మండుతున్న అగ్నిగోళాలు అని ఎవరికీ తెలియలేదు.. అప్పటి వరకూ ఈ సూర్య చంద్రుల నక్షత్రాలు మత గ్రంధాల అధీనం లో ఉంటూ ఆయా దేవుళ్ళ సృష్టిగా ఉంటూ ఇవన్నీ ఆ దేవుళ్ళ అధీనం లో ఉంటూ వారితో మాట్లాడటం విడ్డూరమే కదా.. విచిత్రం ఏమిటంటే నేటికీ చాలా మంది ఆ మైకం లోనే ఉన్నారు. శాస్త్ర విజ్ఞాన మే లేకపోతె నేటికీ మానవుడు ఆటవిక జీవితమే గడిపి ఉండేవాడు. నేటికీ బాటసారి లా జీవించే వాడు. నేటికీ లిపి లేక అరుపులతో సైగలతో జీవించే వాడు.. నేటికీ క్రూర మృగాలు కు భయపడుతూ బిక్కు బిక్కుమంటూ జీవించి ఉండేవాడు.. సైన్స్ అనేది సత్యం వాస్తవం ఆధారంగా బోధిస్తుంది.. మతం అనేది అర్దం కానిదానికి ఊహించి బోధిస్తుంది. ఎప్పటికైనా మత శాస్త్రం పై విజ్ఞాన శాస్త్రముదే పై చేయి..ఎందుకంటే విఙ్ఞాన శాస్త్రం ఎప్పుడైతే దూసుకు వచ్చిందే మత శాస్త్రాలు పాత రికార్డ్ లా రిపీట్ అవుతున్నాయి తప్పా కొత్తవి రాలేదు. గత వెయ్యేళ్ళ నుండి ఈ సాంకేతిక విజ్ఞానానికి భయపడి ఏ కొత్త దేవుడూ రాలేదు అంటే మనకు స్పష్టంగా అర్ధం అవుతోంది.. కావునా మనం సైన్స్ ను బోధిస్తున్న ప్పుడు శాస్త్రవేత్త ల ఆలోచన విధానాన్ని విద్యార్థులకు చెబుతూ తర్క ఆలోచనను వారిలో నింపాలి.
ఆకాశం అంటే మీదనే కాదూ భూమి క్రింద కూడా ఉంటుందని వారికి అవగాహన రావాలి. వాస్తులు అనేవి భూ భ్రమణ పరిభ్రమణ వలన మారుతూ ఉంటాయనే అవగాహన వారిలో కలగాలి. మనం తూర్పు వైపు కు నిర్మించిన ద్వారం నైట్ ఏ వైపున ఉండి వుంటుందో విద్యార్థులు ఆలోచించే విధంగా ఉండాలి. విద్యార్థులలో మరిన్ని ఆలోచనలు రేకెత్తించాలి.. అండోత్పాద క జీవులకు పాలు జీర్ణం కానప్పుడు పాములు కూడా పాలు త్రాగవు అని తెలియ జేయాలి. మనకు ఏ ఏ లిపిలు ఎప్పుడు ఏర్పడ్డాయి అవి ఏర్పడిన తర్వాత మాత్రమే ఆయా మత గ్రంధాలు రాయబడ్డాయి అని అందరికీ తెలియజేయాలి.. మత గ్రంధాలు చెప్పిన కొన్ని విషయాలూ తప్పు అని సైన్స్ నిరూపించింది. కానీ సైన్స్ నిరూపించిన ఒక్క అంశం కూడా మతగ్రందాలు తప్పు అని నిరూపించలేదు.. కావునా ఎప్పటికీ విఙ్ఞాన శాస్త్రం దే పై చేయి. నేటికీ మత గ్రంధాల విజయాలు అందులో దేవుళ్ళు కొన్ని వేల లక్షల క్రిందవి అని చెప్పుకోవడానికి మాత్రమే. కానీ సైన్స్ అలా కాదూ, సునామీ వచ్చినా తెలియజేసీ చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది. భూకంపాలు అగ్నిపర్వతాలు బద్దలై ఏమి జరిగినా వాన వచ్చినా వరద వచ్చినా ముందుగా తెలియజేస్తున్నది మన విఙ్ఞాన శాస్త్ర పరిజ్ఞానమే. మరే ఇతర గ్రంధాలు కాదు..జ్ఞానం వర్ధిల్లాలి..
అందరికీ NATIONAL SCIENCE DAY శుభాకాంక్షలు..