పూసిన పూలన్నీ కాయలవుతాయా

పూసిన పూలన్నీ కాయలవుతాయా   పూసిన పూలన్నీ కాయలవుతాయా అన్నది సామెత . ప్రయత్నం విఫలమైన సందర్భంలో విసిగిపోవద్దని, మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయమని ధైర్యం చెప్పే సందర్భాలలో ఈ సామెత వాడటం కనిపిస్తుంది. చెట్టుకు పువ్వులు పూస్తాయి. అయితే పూసిన పూలన్నీ కాయలవ్వవు, పండ్లుగా మారవు.

శంఖులో పోస్తేగాని తీర్థం కాదని

శంఖులో పోస్తేగాని తీర్థం కాదని   దేనికైనా స్థానం, సమయం, సందర్భం లాంటి వాటిని బట్టి వాటి విలువ వుంటుందని అర్థం. చెంబులో వున్నప్పుడు నీళ్లు అంటారు. అదే నీరు శంఖంలో పోస్తె తీర్థం అవుతుంది ఆ నీరుకు భక్తి ఆపాదించబడుతుంది.

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మంత్రాలు పనిచేస్తాయనేది ఒట్టి మూడ నమ్మకమని దీని అర్థం: మంత్రాలకు చింత కాయలు రాలవు. ఇంత చిన్న పని కూడా చేయలేని మంత్రాలు ఇంకేం పని చేయగలవు.

అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు

అందితే జుట్టు …అందకపోతే కాళ్ళు   కొంతమంది యెప్పుడూ పక్కవారి పై తమదే పై చేయిగా ఉండాలని భావిస్తుంటారు . అందుకోసం అతితెలివిగా వ్యవహరిస్తుంటారు ,.ఎదుటివారి జుట్టు తమ చేతిలో ఉండాలన్నట్లు మాయోపాయాలను పన్నుతుంటారు . బెడిసి కొడితే కాళ్ళబేరానికి వచ్చి క్షమాపణ వేడుకుంటారు.వీరిని ఎట్టిపరిస్థితుల్లోను నమ్మకూడదు. ఇటువంటి వారిని ఉద్దేశించి ఈ సామెతను చెపుతారు.

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు   మనిషి కష్టకాలంలో కృంగిపోకుాడదు. అలాంటి సమయంలో ధైర్యంతో నిలబడి సమస్యలను ఎదుర్కోవాలి. కష్టం కలిగినపుడు దానికి కలిగిన కారణాలేంటో తెలుసుకోవాలి. దానివల్ల ఆ కష్టాలు మనకు దుారమవుతాయి. అంతేగాని దేనితోనో , ఎవరితోనో పోల్చకోకుాడదు . అలా చేస్తే బాధే తప్ప ఇంకా ఏమి మిగలదు. కష్టాలు కలిగినపుడు Read More …

గోరంత ఆలస్యం…కొండంత నష్టం

గోరంత ఆలస్యం…కొండంత నష్టం   ఏ సమయానికి చేయాల్సిన పనులను ఆ సమయానికి చేసి తీరాలి. అలా చెయ్యని పక్షంలో నష్టం అనుభవించక తప్పదు. క్షణకాలం ఆలస్యం జరిగినా , చేరుకోవాల్సిన చోటుకు వెళ్ళలేక పోయిన తీవ్రంగా నష్టం ఎదురుకోవాలి. కాబట్టి సోమరితనాన్ని విడిపెట్టి చురుకుగా పనిచేయాలని చెప్పడమే ఈ సామెత అర్థం.

కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి

కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి పెద్దలు సంపాదించిన ఆస్తి ఎన్ని కోట్లు ఉన్న దాన్ని తింటూ కూర్చుంటే చివరకు పైసా లేని స్థితికి వచ్చేస్తాం . అటువంటి దుస్థితి యెవరూ తెచ్చుకోకుాడదు. కొండనైన ప్రతిరోజూ పగలగొట్టి రాళ్ళను తీసుకువెళ్ళుతుా ఉంటెే చివరకు ఒకనాడు కొండే కనిపించకుండా పోతుంది. మనిషికి సోమరితనం పనికిరాదని, ఏదో ఒక గౌరవప్రదమైన Read More …