మునిగి పోయే వాడికి గడ్డి పోచ దొరికినట్లు

మునిగి పోయే వాడికి గడ్డి పోచ దొరికినట్లు   ప్రమాదంలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు ఎంత చిన్న సాయమైనా ఆశిస్తారు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత.

ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి

ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి దూడలకు పుట్టి నప్పుడే చెవులు ఉంటాయి. ఆ తర్వాతనే కొమ్ములు మొలుస్తాయి. కాని చెవులకన్నా ఆ తర్వాత వచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయి. ముందు ఉన్నవాళ్ళకంటే వెనుక పరిచయమైన వాళ్ళకు అధిక ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఈ సామెతను వాడుతారు.       HOME

మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె

మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె   తినటానికి తిండి లేనపుడు మీసాలకి సంపెంగ నూనె కావాలనడం వినేవారికి హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే ఉన్నదానితో సంతృప్తి పడక అతిగా ఆశ పడే వారిని ఈ సామెతతో పోలుస్తారు.

మాట పోయాక ప్రాణం వున్నా ఒకటే పోయినా ఒకటే

మాట పోయాక ప్రాణం వున్నా ఒకటే పోయినా ఒకటే   నిజాయితీగా వుండే వారు మాటకు ప్రాణంకన్న విలువిస్తారని ఈ సామెతకు అర్థము.       Home

మనిషి మర్మం-మాను చేవ బైటికి తెలియవు

మనిషి మర్మం-మాను చేవ బైటికి తెలియవు   మనిషి బయటకు ఎలా కనబడుతున్నా… లోన అతని అంతరంగం ఎలా ఉంటుందో బయటకు తెలియదు. అలాగే మానుకు లోన ఎంత చేవ ఉన్నదో బయటకు తెలియదు.     HOME

మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?

మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?     తప్పు మన దగ్గర పెట్టుకొని ఇతరులను నిందించ తగదు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత.     HOME

కొన్నది వంకాయ..కొసరింది గుమ్మదికాయన్నట్లు

  కొన్నది వంకాయ..కొసరింది గుమ్మదికాయన్నట్లు   పరిమాణంలోను , ఖరీదు లోను వంకాయ, గుమ్మడికాయ కంటే చాలా చిన్నది.వంకాయను కొని అందుకు కొసరుగా గుమ్మడికాయను ఇవ్వమంటే ఎలా? అలాగే కొంతమంది ఏదో కొద్దిపాటి పని చేసి అంతకు వందరెట్లు అధికంగా, లేదా ఉచితంగా ఏదైనా ప్రతిఫలం వస్తే బాగుండునని భావిస్తుంటారు. అలా తక్కువ పని చేసి Read More …

ఆడువారి మాటలకు అర్ధాలే వేరు

ఆడువారి మాటలకు అర్ధాలే వేరు స్త్రీలు పురుషులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేరు. మనసులో ఒకటి ఉంచుకొని పైకి మరోటి చెప్పుతారు. అంటే ఆడవారు పురుషులకు తేలికగా అర్ధం కారని ఈ సామెత చెబుతుంది.

బడిలేని చదువు, వెంబడిలేని సేద్యం..

బడిలేని చదువు, వెంబడిలేని సేద్యం.. వ్యవసాయాధారితమైన దేశం కనుక మన దేశంలో సేద్యాన్ని పోలికగా తీసుకొని అవతరించిన సామెతలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఇదొకటి. చదువు, వ్యవసాయం రెండూ సక్రమంగా ఉండాలంటే ఏ పరిస్థితులుండాలో దీనిలో చెప్పటం కనిపిస్తుంది.