తన సత్కర్మాచరణం బున భాగ్యము వేగవృద్ధి బొందు జగత్ప్ర్రా ణుని వర సాహాయ్యముచే ననలం బెంతైన బెరుగునయ్య కుమారా! తాత్పర్యం: ఓ కుమారా! అగ్నివృద్ధి పొందాలంటే వాయువు ఎట్లు అవసరమగునో మంచిపనులు చేయుటవలన సంపదలు కూడా అట్లే అభివృద్ధి చెందును.
Category: శతక పద్యాలు
చిన్నవయసునందె చిత్తాలు రంజించు
చిన్నవయసునందె చిత్తాలు రంజించు పద్య తతులు నేర్చి పలుక వలయు పద్య ధారణమ్ము ప్రతిభను పెంచును తెలిసి మెలగ మేలు తెలుగు బాల. తాత్పర్యం: చిన్న వయసులో ఎన్నో రకాల పద్యాలు నేర్చుకొని పదే పదే పలుకుతూ ఉండాలి. పద్యాలు నేర్చుకొని గుర్తు పెట్టుకోవడం వల్ల ప్రతిభ పెరుగుతుంది. తెలుసుకుని మసులుకో ఓ తెలుగు బాల.
ఆలి మాటలు విని అన్నదమ్ములబాసి
ఆలి మాటలు విని అన్నదమ్ములబాసి వేరే పోవువడు వెర్రివాడు కుక్క తోక బట్టి గోదావరీదునా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం : భార్య మాటలు విని అన్నదమ్ములను వదిలిపోవుట అజ్ఞానము. కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదుట అసాధ్యము.
తామసించి చేయ దగదెట్టి కార్యంబు
తామసించి చేయ దగదెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమె యగును పచ్చికాయదెచ్చి పడివేయ ఫలమౌనె వి శ్వ దా భి రా మ వి ను ర వే మా! భావము : పచ్చి పింది కాయను తెచ్చుకొని తింటే ఫలమవుతుందా (రుచిగా ఉంటుందా?) అలాగే బాగా మ్రుగ్గిన,కుళ్ళిన ఫలము కూడా విషంతో సమానం కదా? Read More …