జీవసాగరమ్ము శ్రేయంపురీతిలో

జీవసాగరమ్ము శ్రేయంపురీతిలో దాటవలయునన్న తప్పకుండ స్నేహ మనెడి నావ నెప్పుడు విడువకు తెలిసి మెలగ మేలు తెలుగు బాల. తాత్పర్యం: జీవితం అనే సాగరాన్ని చక్కగా దాటాలంటే స్నేహమనే పడవను ఎప్పుడూ విడవకు. తెలుసుకుని మసులుకో ఓ తెలుగు బాల.     home

హీనగుణమువాని నిలుజేరనిచ్చిన

హీనగుణమువాని నిలుజేరనిచ్చిన నెంతవానికైన నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ   తాత్పర్యం: ఈగ కడుపు లోపలికి పోతే వికారపెట్టినట్టుగానే, నీచమైన మనస్తత్వం కలవాడిని ఇంటికి రానిచ్చినట్లయితే ఎవరికైనా సరే కీడు జరుగుతుంది.   ఈగ అంటే చిన్న ప్రాణైన బాక్టీరియాగా తీసుకుంటే, అది మనిషి లోపల ఆరోగ్యపరంగా ఎంత Read More …

మార్పు లేదైన సులువుగా మలచు

మార్పు లేదైన సులువుగా మలచు కొనుట సమయపాలన వలననే సాధ్యమగును; సమయపాలన చేతనే సకల జనులు కరము సంస్తుత్యమానులై పరగగలరు   భావము : సమయపాలన వలన అవసరమైతే తగిన మార్పులు చేసుకోవటానికి సాధ్యమౌతుంది. సమయపాలన నియమంగా పాటించే వారే అందరిచేత స్తుతింపబడుతారు.

సిరిగలవాని కెయ్యెడల జేసిన మే లది

సిరిగలవాని కెయ్యెడల, జేసిన మే లది నిష్ఫలం బగున్; నెఱి గుఱి గాదు; పేదలకు, నేర్పునం జేసిన సత్ఫలం బగున్; వఱపున వచ్చి మేఘండొకచొ, వర్షము వాడిన చేలమీదటన్ కురిసినం గాక, యంబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా!   తాత్పర్యం:-   ఏ సహాయమైనా, పని అయినా సార్థకత సిద్ధించాలంటే అర్హతగల వారికే చేయాలి. Read More …

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్ భావం : ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా భయపడక చివరివరకు  లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి లక్షణం . అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే Read More …

నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు

నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు దీయు బయట కుక్కచేత భంగపడును స్థానబలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యం: నీళ్లలో ఉన్నంత సేపే మొసలి శక్తి పనిచేస్తుంది. ఏనుగును సైతం నీళ్లలో ఉండి పట్టిందంటే ఎట్టి పరిస్థితుల్లో అది విడువదు. అదే నేలపైకి వచ్చిందా అంతటి మొసలికి కూడా శక్తి క్షీణించినట్లే. ఆఖరకు కుక్కతోకూడా Read More …

ఆటపాటతోడ హాయిగా చదువంగ

ఆటపాటతోడ హాయిగా చదువంగ చదువు తలల కెక్కు ఛాత్రులకును ఆటపాట లెపు డు ఆరోగ్య మందించు తెలిసి మెలగ మేలు తెలుగు బాల. తాత్పర్యం: ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ హాయిగా చదువుకోవాలి. అలా చదువుకున్న పిల్లలకే చదువు వంటిబడుతుంది. ఆటలు ఆరోగ్యానికి మంచివి. కేవలం చదువు మీద కూర్చుంటే లాభం లేదు. తెలుసుకుని మసులుకో Read More …

పరువు తీయు రీతి పలుకాడ వలదురా

పరువు తీయు రీతి పలుకాడ వలదురా నొచ్చుకున్న మనసు విచ్చి పోవు! ఎదుట వారి యెడల యెగతాళి యేలరా? సర్వ జనుల హితము సౌఖ్య పథము   భావం: ఇతరుల పరువుకు భంగం కలిగించే విధంగా మాట్లాడకు.వారి మనసులు నొచ్చుకుంటాయి.వికల మనస్కులు అవుతారు.ఎదుటవారిని ఎగతాళి చేయడం ఎందుకు?అందరి మంచిని కోరుకో!అదే జీవితం సుఖవంతంగా ఉండడానికి సరైన Read More …

శక్తి చాలనపుడు శత్రువుల్‌ ఎదురైన

  శక్తి చాలనపుడు శత్రువుల్‌ ఎదురైన తలను వంచుకొనుట తగిన దౌను; తీరు మారకుండు తీవ్రమౌ గాలికి వంగి గడ్డి పరక భంగపడిన; భావము :   తనకు శక్తి చాలనపుడు శత్రువెదురైతే తలవంచుకొని పోవటం మంచిది. తీవ్రంగా గాలి వీచినపుడు గడ్డిపరక వంగిపోయి మరల యధాస్థితికి చేరుకోదా!  

తలనుండు విషము ఫణికిని

తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్ తలతోక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!   భావం: పాముకి దాని పడగలో విషం ఉంటుంది. తేలుకి కొండిలో ఉంటుంది. కాని మనిషికి మాత్రం తల, తోక అనే భేదం లేకుండా శరీరమంతా ఉంటుంది. ప్రతిపదార్థం విషము అంటే గరళం. ఫణికిని అంటే Read More …