AP Residential Schools Admissions 2024-25

 

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో ప్రవేశాల కోసం ‘ఏపీఆర్‌ఎస్ క్యాట్-2023’ నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతితోపాటు 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీని చేపట్టనున్నారు.

విద్యార్థుల నుంచి ఏప్రిల్‌ 4 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను మే 12 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల మొదటి జాబితాను జూన్‌ 8న, రెండో జాబితాను జూన్‌ 16న, మూడో జాబితాను జూన్‌ 23న ప్రకటించనున్నారు.

వివరాలు…

* ఏపీఆర్‌ఎస్ క్యాట్-2023

సీట్ల సంఖ్య: 5వ తరగతి-3920 సీట్లు. 6-8వ తరగతులు-356 సీట్లు ఉన్నాయి.

అర్హతలు..

5వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2021-22 విద్యాసంవత్సరంలో 3వ తరగతి చదివి, 2022-23 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతూ ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2012 – 31.08.2014 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2010 నుండి 31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.

6వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2021-22 2022-23 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2011 – 31.08.2013 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య జన్మించి ఉండాలి.

7వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2022-23 విద్యాసంవత్సరంలో 6వ తరగతి చదివి ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2010 – 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2008 నుండి 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి.

8వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2022-23 విద్యాసంవత్సరంలో 7వ తరగతి చదివి ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2009 – 31.08.2011 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2007 నుండి 31.08.2011 మధ్య జన్మించి ఉండాలి.

జనరల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ఓసీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్, మైనార్టీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. మైనార్టీ విద్యార్థులు మైనార్టీ పాఠశాలల్లో ప్రవేశం కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండవచ్చు.

తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షకు మించి ఉండకూడదు. తెల్లరేషన్ కార్డు ఉండాలి. ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఆదాయ పరిమితి వర్తించదు.

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 100 ప్రశ్నలు అడుగుతారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్మీడియట్ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

  • నోటిఫికేషన్ వెల్లడి: 04.04.2023.
  • ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 04.04.2023.
  • ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేది: 24.04.2023
  • హాల్‌టికెట్ల విడుదల: 12.05.2023
  • పరీక్ష తేది: 20.05.2023. (10.30 AM to 12 PM)
  • ఫలితాల వెల్లడి: 08.06.2023.

Website

HOME

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *