AP HALFDAY SCHOOLS FROM..

 

ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఫిబ్రవరి నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడు. గత పది రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి.

పగటిపూట బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విపరీతమైన ఎండ ఉంటుంది. పిల్లలు, వృద్ధులు ఆ సమయంలో బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక ఎండలు మండతున్న నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో.. విద్యార్థుల కోసం ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది.

Andhra Pradesh రాష్ట్రంలో ఒంటి పూట ( Half day schools) బడులను ఈ నెల 18 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.

15-03-2024 నుంచి ఒంటిపూట బడులు పెట్టాలని ఉపాధ్యాయులు కోరుతుండగా….
18-03-2024 నుంచి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది.

 

HOME

One thought on “AP HALFDAY SCHOOLS FROM..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *