AP పదవతరగతి ఫలితాలు విడుదల
AP పదవతరగతి ఫలితాలు విడుదల :ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిసిన తరువాత పది రోజుల్లో ఆన్సర్స్ పేపర్స్ ని వాల్యుయేషన్స్ చేయడం జరిగిందని మీ అందరికీ తెలుసు.
అయితే వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ను ఏపీ ప్రభుత్వము 22-04-2024 అనగా సోమవారం విడుదల చేయనున్నట్లు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ యస్ సురేష్ కుమార్ I A S తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 22, సోమవారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఉదయం 11 గంటలకు ఫలితాలను విజయవాడలోని తాజ్ హోటల్లో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేయనున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం స్టూడెంట్స్ తమ హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
For results click here : results