పిడుగులం పాట
పిడుగులం మేం బుడుగులం
నింగికి నేలకు నిచ్చెనలం
విశ్వ ప్రేమకు వారసులం
బంక మట్టితో బండలు చేస్తాం
ఇసుకతోనే మేం కోటలు కడుతాం
రావి ఆకులతో బూరలు చేస్తాం
కొబ్బరాకులతో రాకెట్లు చేస్తాం
వానొస్తే మేం గంతులు వేస్తాం
కత్తి పడవలే సొంపుగ చేస్తాం
ఆటలు పాటలు కథలని చెపితే
తప్పకుండా మేం బడికి పోతాం