Medicine values of pomegranate
Medicine values of pomegranate: దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.
అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ.
దానిమ్మ బెరడు, తొక్క, గింజలను విరోచనాల నివారణకు ఔషధంగా వాడుతారు.
దానిమ్మ పండు రసం కుష్టు వ్యాధికి పనిచేస్తుంది.
ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘ రోగాలే కాక, దగ్గు, వడదెబ్బ, నీరసం నుండి ఉపశమనం కలుగుతుంది.
కాళ్ళ వాపులకు ఈ ఆకును వాపు ఉన్న చోట కడితే.. తగ్గుతాయి.
గర్బవతులు ప్రతి రోజు ఫోలిక్ ఆమ్లం తీసుకోవాలి. దానిమ్మ రసం ఒకసారి తాగడము వలన 60 మి.గ్రా ఫోలేట్ వస్తుంది.
దానిమ్మ సహజ యాస్పిరిన్. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది.
పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.
ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది.
ఆస్టియోఆర్థ్రయిటిస్తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు.
వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం.
నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు ఇది.
దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కిటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి.
దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది.
గొంతు రోగాలకు ఔషధం దానిమ్మ.
దీని ఆకులకు నూనె రాసుకుని వాపు ఉన్న చోట కడితే కల్లవాపులు తగ్గుతాయి.
అధికరక్తపోటుతో బాధపడుతున్న వారికి మరియూ గుండెజబ్బులున్నవారికి మేలు చేస్తుంది.
మూత్రపిండాల సమస్యలున్నవారికి బాధలను నివారిస్తుంది. దానిమ్మ జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.
దానిమ్మగింజలు నోటిలో వేసుకుని నమలడము కన్న దాన్ని రసము తీసుకొని తాగడము మేలు … మంచిది.
ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి.
అల్జీమర్స్, వక్షోజ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి.
సహజ ఆస్ప్రినే కాదు… దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా.
దానిమ్మ రసం రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది. అంగస్తంభన సమస్యలతో బాధపడేవారికి సరైన ఔషధం.
సంతాన సాఫల్యతను పెంచే శక్తీ ఉంది దీనికి.
గర్భస్థశిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన ఫోలిక్ యాసిడ్ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది.
గర్భిణులు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే మంచిది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా తప్పుతుంది.
వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం.
ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూతనుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి.
అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.
రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు విరుగుడు దానిమ్మ రసం.
దానిమ్మ రసము అంగసంభాన సమస్యలను నివారిస్తుంది.
దానిమ్మ శృంగార ప్రేరితంగా పనిచేస్తుంది.
గుండె (హృదయము) కు మేలు చేస్తుంది. ‘కొలెస్టరాల్ ‘ వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది.
రక్తనాళాలు ముసుకుపోయే గుణము నుండి రక్షిస్తుంది.
దానిమ్మ గింజల, నూనె … రొమ్ము కాన్సర్ అదుపుచేయు లక్షణము కలిగివుంది.