Who will take Azithromycin tablet?

Who will take Azithromycin tablet? అజిత్రోమైసిన్ టాబ్లెట్ ఎవరు వాడాలి ? అవగాహన.

Azithromycin talet Uses: ప్రస్తుతం ఈ అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్లను అధికంగా ఉపయోగిస్తున్నారు. కరోనా విజృంభించినప్పటి నుంచి అనేక మంది ఈ Azithromycin tablet ను అనేకమంది వేసుకోవడం ప్రారంభించారు.

ఇప్పటికైతే ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు అందరూ ఈ అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్ ను వేసుకొని ఉంటారు.

ఈ ట్యాబ్లెట్ కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Azithromycin tablet ఉపయోగం ఏమిటంటే ?

గొంతు, నోరు, చెవి, ముక్కులో ఇన్ఫెక్షన్ సోకినట్లయితే అక్కడ బ్యాక్టీరియా పెరగకుండా ఈ అజిత్రోమైసిన్ అడ్డుకుంటుంది. కడుపులో నొప్పి, వికారం తలనొప్పి, అతి సారం లాంటివి ఏవైనా ఉన్నా కూడా ఈ ట్యాబ్లెట్స్ ను వేసుకుంటుంటారు. ఎమర్జన్సీకి ఈ అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్స్ ను వేసుకోవచ్చు.. అయితే డాక్టర్ సలహా మేరకే వీటిని వేసుకోవాలి. ప్రస్తుతం అనేక రకాల కొత్త ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి సొంత వైద్యం వద్దు దయచేసి గమనించగలరు 🙏.

అజిత్రోమైసిన్ టాబ్లెట్లను ఎవరు తీసుకోకూడదు ?

ఎలర్జీ ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవద్దు. గుండె, కాలేయం, ముత్ర పిండాల సమస్యలు ఉన్నా, గర్భవతులు అయినా ఈ ట్యాబ్లెట్స్ వాడే ముందు డాక్టర్ సలహా తప్పని సరిగా తీసుకోవాలి.

అజిత్రోమైసిన్ 500ఎంజీ టాబ్లెట్ ఉపయోగాలు

కమ్యూనిటీ అక్వైర్డ్ నుమోనియా (CAP): ఇది ప్రధానంగా ఉపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్. మేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా, మైకోప్లాస్మా న్యుమోనియా, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా లాంటి బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుంది. దీని చికిత్సలో అజిత్రోమైసిన్ ను ఉపయోగిస్తారు.

చర్మం_అంటువ్యాధులు:

స్టెఫిలోకాకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్, పైయోజెనెస్ లాంటి బ్యాక్టీరియా వల్ల చర్మం ఇన్ఫెక్షన్ అవుతుంది. దీని చికిత్సలో ఈ అజిత్రోమైసిన్ ను ఉపయోగిస్తారు.

యురేత్రైటిస్_సెర్విసిటిస్: యురేత్రైటిస్ అంటే మూత్రాశం, ఈ మూత్రాశయం గొట్టం నుంచే మూత్రం బయటికి వెళ్తుంతి.. ఈ మూత్రాశయం వాపు సమస్యతో బాధపడే వారు అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్ ను ఉపయోగిస్తారు.

ఫారింగైటిస్_టాన్సిలిటిస్: ఫారింగైటిస్, టాన్సిలిటిస్ అనేవి అంటువ్యాధులు. వీటివల్ల గొంతులో టాన్సిల్స్ ఫార్మ్ అయ్యి వాచిపోతాయి. ఇది తగ్గడానికి కూడా అజీ 500 ఎంజీని తీసుకుంటారు.

సైనసైటిస్: సైనసైటిస్ అంటే ముక్కు చెవి, కళ్ల నుదిటి భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. దీని చికిత్సలో కూడా అజిత్రోమైసిన్ ను వాడతారు.

బ్రోన్కైటిస్: బ్రోన్కైటిస్ తో శ్వాస నాళాలు వాచిపోయి ఉపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దగ్గు, ఛాతీలో అసౌకర్యం, శ్వాస ఆడకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. అప్పుడు కూడా డాక్టర్లు ఈ అజిత్రోమైసిన్ ను వాడమని అడ్వైజ్ చేస్తారు.

అజిత్రోమైసిన్_వల్ల_కలిగే_దుష్ర్ప్బభావాలు

వికారం, వాంతులు

కడుపు నొప్పి

ఛాతి నొప్పి

తలతిరగడం

అలసట

తలనొప్పి

దద్దుర్లు

అతిసారం

కడుపులో అధిక అపాన వాయువు

చర్మం యోక్క ఫోటోసెన్సిటివిటీ

ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.­

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *