చుండ్రు నివారణకు హోం రెమిడి

చుండ్రు నివారణకు హోం రెమిడి

ఆపిల్ సీడర్ వెనిగర్‌తో

చుండ్రు నివారణకు హోం రెమిడి : ఆపిల్ సీడర్ వెనిగర్‌తోనూ చుండ్రును అరికట్టవచ్చు. ఫంగస్‌ను నాశనం చేయడంలో ఇది ఎంతో ఉపకరిస్తుంది.

ఇందుకోసం వెనిగర్, నీటిని సమపాళ్లలో కలపాలి. దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు.

ఇలా కొద్ది రోజులపాటు చేయడం వల్ల డాండ్రఫ్‌ను కూడా అరికట్టవచ్చు.

షాంపూ సరిగా చేసుకోవాలి..

షాంపూ చేసుకున్న తర్వాత సరిపడా నీటితో తలను శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా తల మీద నూనె, మృత కణాలు తొలగిపోవు.

ఫలితంగా అది డాండ్రఫ్‌కు దారితీస్తుంది. తక్కువ గాఢత ఉండే షాంపూతో తరచుగా తలంటుకోవాలి.

షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్ రాసుకునే అలవాటు ఉంటే.. దాన్ని మాడుకు అంటకుండా చూసుకోండి.

ఆస్పిరిన్ ట్యాబ్లెట్లతో..

ఆస్పిరిన్ ట్యాబ్లెట్లతోనూ డాండ్రఫ్‌ను అరికట్టవచ్చు. రెండు ఆస్పిరిన్ ట్యాబ్లెట్లను నలిపి న్యాప్‌కిన్‌లో ఉంచి ముక్కలుగా చేయాలి.

తర్వాత ఆ పొడిని గిన్నెలోకి తీసుకొని రెగ్యులర్‌గా వాడే షాంప్‌ను కొద్దిగా ఆ పొడికి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు నిమిషాలయ్యాక నీటితో కడిగేసుకోవాలి.

కొబ్బరి నూనెతో..

కొబ్బరి నూనెతోనూ డాండ్రఫ్‌ను తరిమేయొచ్చు. కాకపోతే దీనికి టీ ట్రీ ఆయిల్‌ను కలపాల్సి ఉంటుంది.

ప్రతి ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకు 5 – 10 చుక్కల స్వచ్ఛమైన టీ ట్రీ ఆయిల్ కలపాలి. తర్వాత దాన్ని మాడుకు పట్టించడం వల్ల చుండ్రుకు కారణమైన ఫంగస్ నశిస్తుంది.

నిమ్మరసంతో..

తాజా నిమ్మరసంలోని యాసిడ్లు చుండ్రును కలిగించే ఫంగస్‌ను నాశనం చేస్తాయి.

నిమ్మరసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నుంచి మంచి పరిమళం కూడా వస్తుంది. నిమ్మరసాన్ని మాడుకు పట్టించి ఒక నిమిషంపాటు వదిలేయాలి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.

డాండ్రఫ్ తగ్గే వరకూ రోజూ ఇలా చేయాలి.

పెరుగుతో..

పులిసిన పెరుగును మాస్క్‌గా వేసుకోవడం వల్ల కూడా డాండ్రఫ్ తగ్గుముఖం పడుతుంది.

ఇందుకోసం పెరుగును తలకు పట్టించి గంటపాటు అలా వదిలేయాలి. తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో కడిగేసుకోవాలి. ఫలితంగా చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు మృదువుగా మారుతుంది.

 

HOME

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *