జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడాలంటే….
మనం తీసుకునే ఆహారం, మానసిక ఒత్తిడి కారణంగా శరీరంలో టాక్సిన్లు పేరుకుపోతాయి. అవి శరీరంలో ఆమ్ల స్థాయుల్ని పెంచుతాయి.
ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి శరీరంలోని పీహెచ్ స్థాయుల్ని అదుపులో ఉంచడంతో పాటు శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయాలంటే ఆల్కలైన్ సమ్మేళనాలు చాలా అవసరం.
అవి రాగిలో ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలామంది రాగి పాత్రల్లో రాత్రంతా నిల్వ చేసిన నీటిని ఉదయం పూట తీసుకుంటూ ఉంటారు.
ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
పొట్టలో ఏర్పడిన అల్సర్లు కూడా తగ్గుముఖం పట్టడంతో పాటు జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.
అంతేకాదు,
రోజూ రాగి పాత్రల్ని ఉపయోగించడం వల్ల కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడి శరీరంలోని వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి.