తామసించి చేయ దగదెట్టి కార్యంబు

తామసించి చేయ దగదెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమె యగును
పచ్చికాయదెచ్చి పడివేయ ఫలమౌనె
వి శ్వ దా భి రా మ వి ను ర వే మా!

భావము :

పచ్చి పింది కాయను తెచ్చుకొని తింటే ఫలమవుతుందా (రుచిగా ఉంటుందా?) అలాగే బాగా మ్రుగ్గిన,కుళ్ళిన ఫలము కూడా విషంతో సమానం కదా? అలాగే , ఏ పనైన సమయానుకూలంగ చేయాలి. తొందర పడ కూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *