పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్,
మూల్యాంకనం రేట్లు పెంచుతూ పాఠశాల విద్యాశాఖ కమి షనర్ ఉత్తర్వులిచ్చారు.
పరీక్షల నిర్వహణకు సంబంధించి గతంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు రోజుకు రూ.44 చెల్లిస్తుండగా, దానిని రూ.66కు పెంచారు.
ఇన్విజిలేటర్ ఛార్జీ రూ.22 నుంచి 33కు పెంచారు.
మూల్యాంకనంలో చీఫ్ ఎగ్జామినర్‌కు చెల్లించే పారితోషికం రోజుకు రూ.264 నుంచి రూ.396కు పెంచారు.
అసిస్టెంట్ ఎగ్జామినర్ క్కు ఒక్కో పేపర్‌కు గతంలో రూ.6.60 పైసలు చెల్లిస్తుండగా, ఇప్పుడు రూ.10 లకు పెంచుతూ ఉత్తర్వులి చ్చారు.
ఈ నెలలో జరిగే పరీక్షలు నుంచే ఇది అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
FULL INFORMATION FOR CLICK : GO.COPY DOWNLOAD