అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది

అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది             Ans: కవ్వం

బుద్ధి బలం

బుద్ధి బలం   పూర్వం బ్రహ్మపుత్ర నదీతీరంలో దట్టమైన అరణ్యం ఉండేది. దాంట్లో రకరకాల క్రిమికీటకాలు, జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది కదలివస్తుంటే చిన్న కొండ నడిచివస్తోందా అన్నట్లుండేది. దాని భారీ కాయాన్ని, శక్తిని చూచి చిన్న చిన్న జంతువులు భయముతో Read More …

తన సత్కర్మాచరణం

తన సత్కర్మాచరణం బున భాగ్యము వేగవృద్ధి బొందు జగత్ప్ర్రా ణుని వర సాహాయ్యముచే ననలం బెంతైన బెరుగునయ్య కుమారా! తాత్పర్యం: ఓ కుమారా! అగ్నివృద్ధి పొందాలంటే వాయువు ఎట్లు అవసరమగునో మంచిపనులు చేయుటవలన సంపదలు కూడా అట్లే అభివృద్ధి చెందును.

బడిలేని చదువు, వెంబడిలేని సేద్యం..

బడిలేని చదువు, వెంబడిలేని సేద్యం.. వ్యవసాయాధారితమైన దేశం కనుక మన దేశంలో సేద్యాన్ని పోలికగా తీసుకొని అవతరించిన సామెతలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఇదొకటి. చదువు, వ్యవసాయం రెండూ సక్రమంగా ఉండాలంటే ఏ పరిస్థితులుండాలో దీనిలో చెప్పటం కనిపిస్తుంది.

పూసిన పూలన్నీ కాయలవుతాయా

పూసిన పూలన్నీ కాయలవుతాయా   పూసిన పూలన్నీ కాయలవుతాయా అన్నది సామెత . ప్రయత్నం విఫలమైన సందర్భంలో విసిగిపోవద్దని, మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయమని ధైర్యం చెప్పే సందర్భాలలో ఈ సామెత వాడటం కనిపిస్తుంది. చెట్టుకు పువ్వులు పూస్తాయి. అయితే పూసిన పూలన్నీ కాయలవ్వవు, పండ్లుగా మారవు.

శంఖులో పోస్తేగాని తీర్థం కాదని

శంఖులో పోస్తేగాని తీర్థం కాదని   దేనికైనా స్థానం, సమయం, సందర్భం లాంటి వాటిని బట్టి వాటి విలువ వుంటుందని అర్థం. చెంబులో వున్నప్పుడు నీళ్లు అంటారు. అదే నీరు శంఖంలో పోస్తె తీర్థం అవుతుంది ఆ నీరుకు భక్తి ఆపాదించబడుతుంది.

అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు?

అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు?   ప్రతి దేశానికీ ఆయా దేశపు సంస్కృతి చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేర్వేరు అయినా మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాలతో పాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, Read More …

ఏడు కూజాల కథ

ఏడు కూజాల కథ అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి, అయినా రాజుకు తెలీని అసంతృప్తి. ఒక రోజు ఆ రాజు వేటకు వెళ్ళినాడు, వేటకు వెళ్ళి జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు, వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక Read More …