పోరు నష్టం పొందు లాభం విరోధము నష్టాన్ని, స్నేహం లాబాన్ని కలిగిస్తుందని దీనర్థం HOME
Month: March 2024
సాధన
సాధన అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఉన్నత పాఠశాల ఒకటి ఉండేది. ఆ బళ్లో పదో తరగతిలో నలభై మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. వాళ్లలో చిన్నా అనే అబ్బాయికి చదువు పట్ల ఆసక్తి తక్కువ. ఒకరోజున వాళ్ల తెలుగు టీచరు కొన్ని ప్రశ్నలిచ్చి, “రేపు వీటిలోంచి తెలుగు పరీక్ష పెడుతున్నాను. అందరూ చక్కగా Read More …
మండే కొవ్వొత్తిని మనం నిటారుగా పట్టుకున్నా, వంచి పట్టుకున్నా, తలకిందులుగా పట్టుకున్నా మంట పైకే వస్తుంది. కారణం ఏమిటి?
మండే కొవ్వొత్తిని మనం నిటారుగా పట్టుకున్నా, వంచి పట్టుకున్నా, తలకిందులుగా పట్టుకున్నా మంట పైకే వస్తుంది. కారణం ఏమిటి?-మంట పైకి లేస్తుందేం? మంటలు పైకే ఎగిసి పడడానికి కారణం ఒక విధంగా గాలే. మంట మండుతున్నప్పుడు అది తన చుట్టూ ఉన్న గాలిపొరలను వేడెక్కిస్తుంది. దాంతో ఆ గాలి సాంద్రత తగ్గుతుంది. అపుడు తేలికైన గాలి Read More …
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడాలంటే
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడాలంటే…. మనం తీసుకునే ఆహారం, మానసిక ఒత్తిడి కారణంగా శరీరంలో టాక్సిన్లు పేరుకుపోతాయి. అవి శరీరంలో ఆమ్ల స్థాయుల్ని పెంచుతాయి. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి శరీరంలోని పీహెచ్ స్థాయుల్ని అదుపులో ఉంచడంతో పాటు శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయాలంటే ఆల్కలైన్ సమ్మేళనాలు చాలా అవసరం. అవి రాగిలో ఎక్కువగా Read More …
పులి-మేక
ఆటగాళ్ళుః యిద్దరు, కావలసినవిః 3-పులులు, 15-మేకలు పైనున్నది కొండ, క్రింద గళ్ళు అడవి, పులులు 3 కొండపైనే వుండాలి. ముందుగా ఒక మేకని అడవిలో వదలాలి, దాన్ని చంపేందుకు ఒక పులిని కొండమీంచి అడవిలోకి దించాలి. పులి కదలికలను బట్టి, మొదటి మేకకు కాపుగా ఇంకో మేకని నప్పాలి. అవసరాన్నిబట్టి ఒక్కొక్క పులిని కొండమీంచి దింపనూనచ్చు, Read More …
నేలనా -బండనా
ఈ ఆట ముఖ్యంగా 6 నుండి 13 వరకు వయసు గల బాల బాలికలు ఆడు ఆట. ఈ ఆటను ఎంత మందయినా ఆడవచ్చును. మొదటగా ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. ఈ ఆట ఆడు ప్రదేశమందు మట్టి ప్రదేశము (నేల), రాతి పృదేశము (బండ) ఉండవలెను. ముందుగా దొంగని నేల కావాలో బండ కావాలో కోరుకోమంటారు. Read More …
గిల్లి దండా ఆట
గిల్లి దండా.. ఇంతకుముందు తరం వారికి ఈ ఆట గురించి పరిచయం అవసరం లేదు. ఈ ఆటను రెండు రకాల కట్టెలతో ఆడతారు. అందులో ఒకటి గిల్లీ. ఇది సాధారణంగా మూడు అంగుళాలు మాత్రమే ఉండి చిన్నగా ఉంటుంది. ఇంకొకటి రెండు అడుగుల పొడవు గల దండా. దీన్ని గిల్లీని కొట్టడానికి ఉపయోగిస్తారు.
అష్టాచమ్మా ఆట
ఈ అష్టాచమ్మా ఆటను ఎక్కువగా ఆడపిల్లలు ఆడేవారు. దీర్ఘచతురస్రాకార నమూనాలను మైదానంలో లేదా ఇంటి దగ్గరే తయారు చేసుకుంటారు. అందులో ఒక రాయిని లేదా ఏదైనా వస్తును సరైన బాక్స్ లో విసిరి, ఆ వస్తువును ఒంటి కాలితో వెళ్లడమే కాకుండా అక్కడ గీసిన లైన్లకు కూడా తాకకుండా బయటకు తీసుకొస్తారు. ఒకవేళ పొరపాటున కాలు Read More …
ఏడు పెంకుల ఆట
ఏడు పెంకుల ఆటను పిథూ అని కూడా పిలుస్తారు. ఈ ఆట అంటే చాలా మంది ఇష్టపడతారు. ఈ ఆటను చిన్నరాళ్లను ఒకదానిపై ఒకటి జోడించి పెడతారు. దానిని బంతితో కొడతారు. దీనికి ముందే ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోతారు. ఇందులో ఏదో ఒక జట్టు ఆటగాళ్లు రాళ్లను పడగొట్టి పరుగులు తీస్తారు. అదే సమయంలో Read More …
ఆడువారి మాటలకు అర్ధాలే వేరు
ఆడువారి మాటలకు అర్ధాలే వేరు స్త్రీలు పురుషులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేరు. మనసులో ఒకటి ఉంచుకొని పైకి మరోటి చెప్పుతారు. అంటే ఆడవారు పురుషులకు తేలికగా అర్ధం కారని ఈ సామెత చెబుతుంది.