శక్తి చాలనపుడు శత్రువుల్ ఎదురైన
తలను వంచుకొనుట తగిన దౌను;
తీరు మారకుండు తీవ్రమౌ గాలికి
వంగి గడ్డి పరక భంగపడిన;
భావము :
తనకు శక్తి చాలనపుడు శత్రువెదురైతే తలవంచుకొని పోవటం మంచిది. తీవ్రంగా గాలి వీచినపుడు గడ్డిపరక వంగిపోయి మరల యధాస్థితికి చేరుకోదా!