ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి
దూడలకు పుట్టి నప్పుడే చెవులు ఉంటాయి. ఆ తర్వాతనే కొమ్ములు మొలుస్తాయి. కాని చెవులకన్నా ఆ తర్వాత వచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయి.
ముందు ఉన్నవాళ్ళకంటే వెనుక పరిచయమైన వాళ్ళకు అధిక ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఈ సామెతను వాడుతారు.