భూమ్యాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది?
వైజ్ఞానిక పరిభాషలో బలానికి, శక్తికి తేడా ఉంది. బలమున్నా శక్తి ప్రమేయంలేని సంఘటనలూ ఉన్నాయి. కానీ బలం లేకుండా శక్తి ప్రమేయం లేదు. కాబట్టి భూమ్యాకర్షణ శక్తి అనడం కన్నా భూమ్యాకర్షణ బలం భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుందనే విధంగానే మనం చెప్పుకోవాలి. భూమ్యాకర్షణ బలం భూమి నుంచి అనంత దూరం వరకు విస్తరించి ఉంటుంది. శాస్త్రీయంగా అది అనంత దూరం దగ్గర శూన్యం అవుతుంది. భూమ్యాకర్షణ ప్రభావాన్ని మరో ఇతర వస్తువు మీద బలం రూపేణా చూడాలి. ఆ బలాన్ని గెలీలియన్ గురుత్వ బలంగా పరిగణిస్తారు. ఈ బలపు విలువ భూమికి ఆయా వస్తువుకు ఉన్న దూరపు వర్గానికి విలోమాను పాతం గానూ, ఆయా వస్తువుకున్న ద్రవ్యరాశికి అనులోమాను పాతంగానూ ఉంటుంది. సుమారు లక్షన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుణ్ణి కూడా తన చుట్టూ తిప్పుకోగలిగినంత బలాన్ని ఇదే భూమి ఉపయోగిస్తుండగా, కొన్ని వేల కిలోమీటర్లు దాటిన వెంటనే వ్యోమశకటంలో ఉన్న వ్యోమగాములు గురుత్వ బలం సరిగా లేక శకటంలో దూదిపింజల్లా వేలాడుతుండటం చూస్తుంటాం. ఈ వైవిధ్యానికి కారణం చంద్రుడి విషయంలో దూరం కన్నా చంద్రుడి ద్రవ్యరాశి ప్రభావం అధికం కావడము,……