ఆటగాళ్ళుః యిద్దరు, కావలసినవిః 3-పులులు, 15-మేకలు
పైనున్నది కొండ, క్రింద గళ్ళు అడవి, పులులు 3 కొండపైనే వుండాలి.
ముందుగా ఒక మేకని అడవిలో వదలాలి, దాన్ని చంపేందుకు ఒక పులిని కొండమీంచి అడవిలోకి దించాలి.
పులి కదలికలను బట్టి, మొదటి మేకకు కాపుగా ఇంకో మేకని నప్పాలి. అవసరాన్నిబట్టి ఒక్కొక్క పులిని కొండమీంచి దింపనూనచ్చు,
కొండమీదకు పంపనూవచ్చు. ఇలా పులుల కదలికల్ని బట్టి, వాటికి అందకుండా 15 మేకల్ని క్రాస్ ల మీద పేర్చాలి, పులి తన తర్వాతి క్రాస్ మీద ఇన్న మేక మీంచి పైనుండి క్రిందికి కాని, అడ్డంగా గాని దూకవచ్చు.
అలా దూకితే ఆ మేక చని పోయినట్లు భావించి ఆటలోనించి తీసేయ్యాలి.
ఆయితే ఒక గడి ఎడంగాఉన్నా, లేదంటే వరుసగా వున్న రెండు మూడు మేకల మీంచి గాని పులి దూకకూడదు.
ఆలాగే 15 మేకల్తోనూ 3 పులుల్ని కదలకుండా కట్టెయ్యచ్చును. అలా ఎక్కువ మేకలు చనిపోతే పులుల పార్టీ, పులులు కట్టుబడిపోతే మేకల పార్టీ నెగ్గినట్లు.
మేకలు పులుల మీంచి దూకలేవు సుమా! ఆడటం అలవాటైతే చదరంగం లాగానే ఆడుకోవచ్చు.