పరువు తీయు రీతి పలుకాడ వలదురా

పరువు తీయు రీతి పలుకాడ వలదురా

నొచ్చుకున్న మనసు విచ్చి పోవు!

ఎదుట వారి యెడల యెగతాళి యేలరా?

సర్వ జనుల హితము సౌఖ్య పథము

 

భావం:

ఇతరుల పరువుకు భంగం కలిగించే విధంగా మాట్లాడకు.వారి మనసులు నొచ్చుకుంటాయి.వికల మనస్కులు అవుతారు.ఎదుటవారిని ఎగతాళి చేయడం ఎందుకు?అందరి మంచిని కోరుకో!అదే జీవితం సుఖవంతంగా ఉండడానికి సరైన మార్గం.

 

 

HOME

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *