చిరు చిరునవ్వులు
చిరు చిరునవ్వుల చిలకల్లారా
బంగరు పలుకుల మొలకల్లారా
మనసులు కలిసి మెలగండీ
మనుగడ కదిలీ మెదలండీ “చిరు చిరు”
గాంధీ తాత ఏమయ్యాడు?
మహాత్ముడై వెలుగొందాడు – ఎందుకని?
కొట్టిన వారికి కొట్టలేదులే
తిట్టిన వారిని తిట్టలేదులే
సమతా మమతా మనదన్నాడు
స్వాతంత్ర్యం సాధించాడు
గాంధీ తాతా జోహార్!
మహాత్మకూ మా జోహార్! “చిరు చిరు”
చాచా నెహ్రూ ఏమయ్యాడు?
ఏమయ్యాడు?
శాంతిదూతగా నిలిచాడు – ఎందుకని?
శాంతి పథమ్మే కాంతి మార్గమని
ప్రపంచమంతా చాటాడు
చాచా నెహ్రూ జోహార్!
ఎర్ర గులాబీ జోహార్!
శాంతి దూతకూ జోహార్! “చిరు చిరు”
భారతమాత ఏమంటోంది?- ఏమంటోంది?
క్రమశిక్షణతో నడువంటోంది
నడువంటోంది
మీరే జాతికి పునాదులు
నీతికి నిజానికి రారాజులు
మంచిని మీలో పెంచండి
మనమంతా ఒకటని చాటండి
భారతమాతా జిందాబాద్!
చల్లని తల్లికి జిందాబాద్!
అన్నపూర్ణకూ జిందాబాద్! “చిరు చిరు”