కొన్నది వంకాయ..కొసరింది గుమ్మదికాయన్నట్లు
పరిమాణంలోను , ఖరీదు లోను వంకాయ, గుమ్మడికాయ కంటే చాలా చిన్నది.వంకాయను కొని అందుకు కొసరుగా గుమ్మడికాయను ఇవ్వమంటే ఎలా? అలాగే కొంతమంది ఏదో కొద్దిపాటి పని చేసి అంతకు వందరెట్లు అధికంగా, లేదా ఉచితంగా ఏదైనా ప్రతిఫలం వస్తే బాగుండునని భావిస్తుంటారు. అలా తక్కువ పని చేసి ఎక్కువ ప్రతిఫలాన్ని కోరడం ఏమంత సమజసం కాదు కదా! అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఈ సామెత పుట్టింది.