ఓయమ్మా తోటనుండి..
ఓయమ్మా తోటనుండి ఏమితెస్తివి?
తోటనుండి పచ్చగడ్డి కోసుకొస్తిని
పచ్చగడ్డి కోసుకొచ్చి ఏమి చేస్తివి?
పచ్చగడ్డి కోసుకొచ్చి ఆవుకేస్తిని
పచ్చగడ్డి మేసి ఆవు ఏమిచ్చింది?
పచ్చగడ్డి మేసి ఆవు పాలిచ్చింది
ఆవిచ్చిన పాలన్నీ ఏమిచేస్తివి?
ఆవిచ్చిన పాలన్నీ కాగబెడితిని
కాగబెట్టిన పాలన్నీ ఏమి చేస్తివి?
కాగబెట్టిన పాలన్నీ పేరబెడితిని
పేరబెట్టిన పాలన్నీ ఏమయ్యాయి?
పేరబెట్టిన పాలన్నీ పెరుగైనాయి
పాలన్నీ పెరుగైతే ఏమిచేస్తివి?
పెరుగంతా కవ్వంతో చిలికినాను
పెరుగంతా చిలికితే ఏమొచ్చింది?
పెరుగంతా చిలికితే వెన్నొచ్చింది
వెన్నంతా తీసినంక ఏమిచేస్తివి?
వెన్నంతా కాచితే నెయ్యయ్యింది
ఇంతకూ నెయ్యికీ ఏదిమూలం?
తోటలోని పచ్చగడ్డి దీనిమూలం.
తోటలోని పచ్చగడ్డి దీనిమూలం.
తోటలోని పచ్చగడ్డి దీనిమూలం.