ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ
ఏపీ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో ఆరో తరగతి ADMISSIONS
• మార్చి 3 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు – ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష
• ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు
ఆంధ్రప్రదేశ్ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు గారు శుక్రవారం ఉతర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో ఉండగా ఈ నెల, మార్చి 3 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని, వచ్చే నెల, ఏప్రిల్ 21న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్ తో తెలుగు/ ఇంగ్లీషు మీడియములో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో మాత్రమే బోధిస్తారని, చదువుకోవడానికి ఎలాంటి ఫీజులు కట్టనవసరం లేదని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష కోసం ఓసీ, బీసీ విద్యార్థులు రూ . 150; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 లను మార్చి 2 నుంచి మార్చి 31 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి Payment Gateway ద్వారా పరీక్ష రుసుము చెల్లించాలని తెలిపారు. తద్వారా కేటాయించిన జనరల్ నెంబరు ఆధారంగా ఏదైనా ఇంటర్నెట్ కేంద్రంలో www.cse.ap.gov.in లేదా https://apms.apcfss.in దరఖాస్తు చేసుకోవాలి.
ఆబ్జెక్టివ్ టైపులో ఉన్న ప్రవేశ పరీక్షలో ఓసీ, బీసీ అభ్యర్థులకు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 30 మార్కులు సాధించాలి.
ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించబడతాయని తెలిపారు.
మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలి.
ప్రవేశ అర్హతలివి:
1) వయస్సు: ఓసీ, బీసీ విద్యార్థులు 01-09-2012 నుండి 31-08-2014 మధ్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు 01-09-2010 నుండి 31-08-2014 మధ్య జన్మించినవారై ఉండాలి.
2) సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల్లో నిరవధికంగా 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలు చదివి, 2023-24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
3) దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు www.cse.ap.gov.in లేదా https://apms.apcfss.in/ చూడగలరు.