ఏడు పెంకుల ఆటను పిథూ అని కూడా పిలుస్తారు. ఈ ఆట అంటే చాలా మంది ఇష్టపడతారు. ఈ ఆటను చిన్నరాళ్లను ఒకదానిపై ఒకటి జోడించి పెడతారు. దానిని బంతితో కొడతారు. దీనికి ముందే ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోతారు. ఇందులో ఏదో ఒక జట్టు ఆటగాళ్లు రాళ్లను పడగొట్టి పరుగులు తీస్తారు. అదే సమయంలో ఇతర జట్టు ప్రత్యర్థి ఆటగాళ్లపై బంతిని విసిరి వారికి అది తగిలితే అవుట్ అని అంటారు. కానీ వారు విసిరిన ఆ బంతి వారికి తగిలేలోపే ఆ రాళ్ల జోడిని అమరిస్తే వారికొక పాయింట్ లభిస్తుంది.