ఆధునిక సైన్స్ పిత సర్ ఐజాక్ న్యూటన్
ఆధునిక సైన్స్ పిత సర్ ఐజాక్ న్యూటన్: మానవ ప్రపంచానికి విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన “సర్ ఐజాక్ న్యూటన్” భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త మరియు తత్వవేత్తగా పేరు పొందారు.ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం సైన్సుగా ఎలా పరిణామం చెందిందన్న అంశంపై చేసిన ఎనలేని కృషికిగానూ ఆధునిక ప్రపంచం అంతా ఆయనను “ఆధునిక సైన్సు పితామహుడు”గా కీర్తించింది.
అధునిక సైన్సును కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు న్యూటన్.ఆయన జనన, మరణ తేదీలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
విశ్వ రహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ ఇంగ్లండ్‌కు దగ్గర్లోగల ఉల్‌తోప్ అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జనవరి 4,1643లో జన్మించాడు.
తను పుట్టడానికి మూడు నెలల ముందుగానే తండ్రి చనిపోగా, తనకు మూడేళ్ల వయసులో తల్లి వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.
దీంతో న్యూటన్ చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వద్దనే పెరిగి పెద్దయ్యాడు.
1661లో ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరిన న్యూటన్.. గణిత, భౌతిక, ఖగోళ శాస్త్ర పరిశోధనలపై మక్కువ పెంచుకున్నాడు.
ఆ తరువాత అక్కడే ప్రొఫెసర్‌గా నియమితుడైన న్యూటన్, 1667లో పరావర్తన దూరదర్శినిని నిర్మించి సంచలనం సృష్టించాడు.
చిన్నతనంలో చెట్టు నుంచి రాలిన యాపిల్‌ను గమనించిన న్యూటన్ అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
ఆధునిక భౌతిక ఆప్టిక్స్‌కు మరింత పునాది వేసిన రంగులతో కూడిన తెల్లని కాంతి యొక్క దృగ్విషయాన్ని అతను కనుగొన్నాడు.
మెకానిక్స్‌లో అతని ప్రసిద్ధ మూడు చలన నియమాలు మరియు గురుత్వాకర్షణ నియమాల సూత్రీకరణ ప్రపంచవ్యాప్తంగా భౌతిక శాస్త్ర ట్రాక్‌ను పూర్తిగా మార్చింది.
ఐజాక్ న్యూటన్ గ్లాస్ ప్రిజం సహాయంతో తెల్లని కాంతి సాధారణ దృగ్విషయం కాదని నిరూపించాడు.
ఇది ఇంద్రధనస్సు యొక్క అన్ని రంగులతో నిర్మితమైందని, ఇది మళ్లీ తెల్లటి కాంతిని ఏర్పరచడానికి తిరిగి కలపగలదని అతను ధృవీకరించాడు.
1727 మార్చి 31ఆయన తుది శ్వాస విడిచారు.చర్యకి, సమానమైన ప్రతిచర్య ఉంటుందనే న్యూటన్ మూడవ నియమం చాలా ప్రసిద్ధి పొందింది. ఈ నియయం రాకెట్ ఇంజిన్ పని చేసే విధానాన్ని వివరిస్తుంది.
One thought on “ఆధునిక సైన్స్ పిత సర్ ఐజాక్ న్యూటన్”