ఆటపాటతోడ హాయిగా చదువంగ

ఆటపాటతోడ హాయిగా చదువంగ

చదువు తలల కెక్కు ఛాత్రులకును

ఆటపాట లెపు డు ఆరోగ్య మందించు

తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

తాత్పర్యం:

ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ హాయిగా చదువుకోవాలి. అలా చదువుకున్న పిల్లలకే చదువు వంటిబడుతుంది. ఆటలు ఆరోగ్యానికి మంచివి. కేవలం చదువు మీద కూర్చుంటే లాభం లేదు. తెలుసుకుని మసులుకో ఓ తెలుగు బాల.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *