అమర వీరుల స్మారక దినోత్సవం
మార్చి 23 -అమర వీరుల స్మారక దినోత్సవం : భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్ థాపర్ బలిదాన దినం.
వీరులు మరణించరు చరిత్రలో నిలిచిపోతారు అమరవీరులకు జోహార్లు
దేశ స్వాతంత్ర్య పోరాటం వివిధ రూపాల్లో జరిగింది. మహాత్మా గాంధీ ఒక మార్గాన్ని ఎంచుకోగా, భగత్ సింగ్ మరో మార్గాన్ని ఎంచుకున్నారు.
చరిత్ర పునరావృతం కాదు. కానీ ఘటనలను పోలిన ఘటనలు జరుగుతూ ఉంటాయి.
ఆ విధంగా గత చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు మరో రూపంలో ఇప్పుడు కూడా జరుగుతున్నాయా అనిపిస్తుంది.
1919లో మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు దశలో ఉండగా భారత దేశంలో స్వాతంత్య్రోద్యమం కొత్త ఉత్సాహంతో ఉరకలు వేసింది.
దానికి ముఖ్యమైన కారణం ఆ యుద్ధ కాలంలో సామ్రాజ్యవాదం బలహీనపడి నూతన సోషలిస్టు రాజ్యమైన సోవియట్ యూనియన్ అవతరించడం, దాని ప్రభావంతో దేశ దేశాలలో వలస పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్రోద్యమాలు పుంజుకున్నాయి.
దీనిని అదుపు చేయడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదం త్రిముఖ వ్యూహాన్ని అనుసరించింది.
ఒకటి మాంటెగ్ ఛైవ్‌సు ఫోర్డ్ సంస్కరణల ద్వారా భారతీయుల స్వాతంత్య్ర అభిలాషను గుర్తించామన్న భావనను కల్పించి సంతప్తిపర్చడం.
రెండు నిర్బంధ చర్యలతో ఉద్యమాన్ని అణచివేయడం. మూడు హిందూ- ముస్లిం ఘర్షణలు సష్టించి ప్రజల మధ్య చీలికలు పెట్టడం.
భారతీయుల స్వాతంత్య్రోద్యమ అభిలాషను అణచివేయడానికి మార్చి మొదటి వారంలో రౌలట్ చట్టం తీసుకు వచ్చింది.
నిరసన తెలిపే హక్కు, ఊరేగింపులు, సభలు జరుపుకునే, సంఘాలు పెట్టుకునే హక్కు ఆఖరికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కును సైతం ఈ చట్టం లాగేసుకుంది.
పౌరుల కదలికలపై తీవ్రమైన ఆంక్షలు విధించింది.
ఈ చట్టానికి వ్యతిరేకంగా అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్‌లో ప్రజలు ఏప్రిల్ 14న సభ జరుపుకోవడానికి జమ కూడారు.
దీన్ని అదునుగా తీసుకుని నాటి పోలీసు అధికారి డయ్యర్ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు సాగించాడు. ఈ కాల్పుల్లో 1200 మంది అసువులు బాశారు.
స్వాతంత్యోద్యమ చరిత్రలో ఇది రక్తాక్షరాలతో లిఖించిన అధ్యాయం. భారత దేశం భగ్గుమంది.
1921 -22లో దేశమంతా స్వాతంత్య్రోద్యమ గాలులు వీచాయి. బ్రిటిష్ వారికి పన్నులు చెల్లించ నిరాకరించడం మొదలుకొని విదేశీ వస్తు బహిష్కరణ వరకు ఇది సాగింది.
గాంధీ ఈ ఉద్యమాన్ని శాంతియుత సత్యాగ్రహ రూపంలో సాగించారు.
అయితే 1922 ఫిబ్రవరిలో చౌరీచౌరాలో జరిగిన ఘటనను ఆసరా చేసుకుని గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఉపసంహరించారు.
జలియన్‌వాలాబాగ్ ఘటనతో చలించిపోయిన భగత్ సింగ్ తన 12వ ఏటనే ఆ స్థలాన్ని సందర్శించి పోరాట స్ఫూర్తిని పొందాడు.
14వ ఏట స్కూలును బహిష్కరించి బ్రిటిషువారిపై తిరుగుబాటు చేశాడు. 1923లో హిందూస్థాన్ రిపబ్లికన్ ఆర్మీలో సభ్యుడుగా చేరాడు.
1925లో మొదటిసారి అరెస్టు వారంటు వచ్చింది. 1926 నుంచి నౌజవాన్ భారత సభలో చురుకైన పాత్ర పోషించాడు.
1928లో సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో లాలా లజపతిరాయ్‌పై లాఠీ ఝళిపించి మరణానికి కారకుడైన శాండర్స్‌ను హత్య చేయడంతో భగత్‌సింగ్ రాజకీయ జీవితం బయట ప్రపంచానికి వెల్లడైంది.
బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి దేశ స్వాతంత్య్రం కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడారు భగత్.
1931, మార్చి 23న రాత్రి 7.30 గంటలకి నాటి బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్‌తోపాటు విప్లవ యోధులు సుఖ్ దేవ్, రాజ్ గురులను హుస్సైన్‌వాలా జైల్లో ఉరి తీశారు.
ఈ ముగ్గుర్ని ఉరి కొయ్యల ముందు వరుసగా నిలబెట్టగా.. వీరు ఏ మాత్రం అధైర్యపడకపోగా.. చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించారు.
భరతమాతను దాస్యశృంఖలాల నుంచి విడిపించడం కోసం భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ప్రాణత్యాగం చేసిన రోజును షహీదీ దివాస్‌గా జరుపుకొంటూ.. ఈ వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాం.