మండే కొవ్వొత్తిని మనం నిటారుగా పట్టుకున్నా, వంచి పట్టుకున్నా, తలకిందులుగా పట్టుకున్నా మంట పైకే వస్తుంది. కారణం ఏమిటి?-మంట పైకి లేస్తుందేం?
మంటలు పైకే ఎగిసి పడడానికి కారణం ఒక విధంగా గాలే. మంట మండుతున్నప్పుడు అది తన చుట్టూ ఉన్న గాలిపొరలను వేడెక్కిస్తుంది. దాంతో ఆ గాలి సాంద్రత తగ్గుతుంది. అపుడు తేలికైన గాలి అక్కడి నుంచి వేగంగా నిలువుగా పైకి పోతుంది. అందువల్ల మంట చుట్టూ ఉన్న ప్రదేశంలో పీడనం తగ్గుతుంది. పీడనం తక్కువగా ఉన్న ఆ ప్రదేశంలోకి దూరాల్లో ఉండే చల్లని గాలి వచ్చి చేరుతుంది. వేడెక్కి పైకి పోయే గాలి వేగం, దూరం నుంచి మంటవైపు వచ్చే గాలి వేగం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా నిరంతరంగా జరుగుతూ మంట చుట్టూ ఉన్న గాలులు వేగంగా పైకి పోతుండడం వల్ల వాటితో పాటే మంట ఎప్పుడూ పైకే లేస్తుంది.