బొట్టు పెట్టుకోవడం వలన ఉపయోగాలు

బొట్టు పెట్టుకోవడం వలన ఉపయోగాలు

బొట్టు పెట్టుకోవడం వలన ఉపయోగాలు: భూవోఘ్రాణ స్వయస్సంధిః అంటే నాసిక పై భాగం భ్రుకుటి మధ్యభాగం కలుసుకొనే చోట పెట్టుకోవాలి అని అర్థం.

ఇక్కడ ఇడ, పింగళ, సుషుమ్న లేక గంగ, యమున, సరస్వతి లేక సూర్య, చంద్ర, బ్రహ్మ అని పిలువబడే మూడు ప్రధాననాడులు కలుస్తాయి.

దీనినే “త్రివేణి సంగమం”అని అంటారు. ఇది పీయూష గ్రంధికి అనగా ఆజ్ఞాచక్రానికి అనుబంధస్ధానం. ఇదే జ్ఞానగ్రంధి అనికూడా పిలువబడుతుంది.

ఎవరైతే సుషుమ్న నాడికి చురుకుదనం కల్గిస్తారో వారు మేధావులౌతారు. మనం ధరించే బొట్టు ప్రభావం పిట్యుటరీ గ్రంధుల పై ఉంటుంది.

“కేనన్” అనే పాశ్చాత్య శాస్ర్తవేత భ్రుకుటి స్థానాన్ని మానవ ధన మెడ వెనుక భాగాన్ని ఋణ విద్యుత్ కేంద్రాలు అన్నారు.

ఇవి రెండు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరణ చేస్తుంటాయి. అందుకే జ్వరం వస్తే వైద్యులు నుదుటి పై చల్లటి గుడ్డ వేయమంటారు.

ఇంకా సూర్యుని నుండీ వచ్చే విశేషమైన శుభ ఫలితాలను ఇచ్చే కిరణాలను ఆకర్షించే శక్తి కేవలం ఎర్రటి కుంకుమకే ఉంది.

అందువలన మనం ఎల్లప్పుడూ ఉత్సాహంగా, మన మెదడు ఉత్తేజితమౌతూ ఉంటుంది. అందుకే ఒకనాడు వేదఘోష ప్రతిధ్వనించింది. ధారణశక్తీ పెరుగుతుంది.

బొట్టుతో బోలెడన్ని ప్రయోజనాలు.

పైన పేర్కొన్న కీలక సున్నిత నాడులను తీక్షణమైన సూర్యకిరణాల నుండి కాపాడేందుకు కుంకుమ ధరించాలి. సాయంత్రం రాత్రి సమయాల్లో కుంకుమకు బదులుగా విభూతిని ధరిస్తే చల్లగా ఉంటుంది.

విభూతి వల్ల రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతలు నియంత్రించబడుతుంది. ఓజస్సు వృద్ధి చెంది ,చర్మరోగాలు రాకుండా రక్షణ కలుగుతుంది.

బొట్టు శరీరంలో ఉష్ణాన్ని పీల్చీవేస్తుంది. జఠరశ్వాసకోశాలకు తగినంత ఉష్ణాన్ని అందిస్తుంది.

మనం సూర్యుని నేరుగా చూడలేము. అదే “రంగుల” కళ్ళద్ధాలు లేదా ఒకవైపు రంగు ఉన్న గాజుద్వారా సూర్యుని చూడగలం.

ఎందుకంటే సూర్యుని కిరణాలు అద్దంపైబడి పరావర్తనం చెందటం వల్లకళ్ళకు హానికలుగలదు.

అంటే ఇక్కడ సూర్య కిరణాల వల్ల కళ్ళకు హాని కలుగకుండా రంగు ఏవిధంగా పని చేస్తుందో ఆవిధంగానే బొట్టు కూడా భ్రుకటిస్థానంలోని జ్ఞాననాడికి హానికలుగకుండా మానవులను కాపాడుతూ వుంటుంది.

 

దృష్టి దోషం తగలకుండా బొట్టు.

మనుషుల్లో కొందరు క్రూర స్వభావం కలిగి ఉంటారు. వారు ఎల్లవేళలా ఇతరుల పైన అసూయా ద్వేషాలతో రగిలిపోతూ ఇతరుల వినాశనాన్ని కోరుకుంటూవుంటారు.

వారి మనసులోని చెడుఆలోచనల ప్రభావమంతా వారి చూపుల ద్వారా ఇతరుల పైన ప్రసరిస్తూ ఉంటుంది.

మానవశరీరంలో అన్నిభాగాలకన్నా ముఖభాగమే అత్యంత ప్రధానమైనది. ఎవరు ఎవరితో మాట్లాడాలన్నా ముఖం చూసే మాట్లాడగలుగుతారు.

అందువల్ల పైన తెలిపిన క్రూరస్వభావం కలిగిన వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి ముఖం చూసి “అబ్బా వీరి ముఖం ఎంతందంగా ఉంది” అని పలుమార్లు మనసులో అసూయపడతారు.

అలా వారి అసూయ చూపుల ద్వారా ఎదుటివారిలోకి ప్రసరించి క్షణాల్లోవారికి తలనొప్పి కలగడం ఎంతోసేపటికిగాని అది తగ్గకపోవడం నిత్యజీవితంలో మనమందరం గమనిస్తూనే వుంటాం .

అందుకే ఈ మానవస్వభావాల పైన పరిశోధనలు చేసిన ఆయుర్వేద మహర్షులు ఇతరుల దృష్టి దోషం మరొకరికి అనారోగ్యం కలిగించకుండా నివారించడం కోసం కూడా ప్రతి మనిషి విధిగా బొట్టుపెట్టుకోవాలి అనే సదాచారాన్ని అలవాటు చేశారు.

బొట్టుపెట్టుకుంటే దృష్టి దోషం ఎలా నివారించబడుతుంది అని మీకు సందేహం కలగవచ్చు.

బొట్టు ఎర్రగా నిండుగా కళకళలాడుతూ ప్రకాశిస్తూ వుండటం వల్ల ఇతరులు ముఖంలోకి చూడగానే వారిదృష్టిని ముందుగా ఈ బొట్టే ఆకర్షిస్తుంది.

వారెంత ప్రయత్నించినా ముఖంలోని అందమైన ఇతరభాగాల వైపు చూడలేరు .

ఈ విధంగా దృష్టి దోషం అనే సమస్య నుండి తప్పించుకోవడానికి మంచి ఆరోగ్యాన్ని పొందడానికే ఈ బొట్టు అనే విధానాన్ని ప్రవేశపెట్టారని మనం తెలుసుకోవాలి.

స్టికర్ బొట్లతో చర్మరోగాలు.

నేటి స్ర్తీలు గతంలో ఎవరికివారు స్వయంగా తయారుచేసుకునే కుంకుమను బొట్టుగా ధరించకుండా విషరసాయనపదార్థాలతో తయారుచేసిన స్టికర్లను బొట్టుగా వాడటంవలన భ్రుకుటి వద్ద చర్మరోగాలు వస్తున్నాయి.

దీనివల్ల కొందరు స్ర్తీలు బొట్టు పెట్టుకోలేకపోతున్నారు. కొందరు బొట్టు ధరించనివారు కూడా మేధావులయ్యారు కాదా అని అనవచ్చు. నిజమే అయితే ఆ మేధావులు బొట్టు ధరించి ఉంటే మరింత మేధా సంపున్నులు అయ్యే వారని మరిచిపోవద్దు.

 

 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *