డెంగ్యూ జ్వరం / DENGUE FEVER
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను అతిగా ఆందోళనకు గురి చేస్తున్న అంశం డెంగీ జ్వరం. కొంత మంది డెంగీ తీవ్రమై చనిపోతున్నారు. ఎందుకంటే డెంగీ వస్తే ప్రత్యేకమైన మందులు లేవు. లక్షణాలని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది.
డెంగీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
విపరీతమైన జ్వరం చలి,తీవ్రమైన తల నొప్పి,ఒళ్లునొప్పులు ,శరీరంపై దద్దుర్లు రావడం విపరీతమైన దాహం వేయడం,నోరు ఎక్కువగా ఆరిపోతుంది. వాంతులు అవడం కళ్లలో నొప్పి రావడం.
తీసుకోవాల్సిన జాగ్రతలు
జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దగ్గరకు వెళ్ళాలి. పరీక్షలు చేయించకుండా మామూలు జ్వరాన
జ్వరం వచ్చిన వెంటనే చల్లని నీళ్లతో శరీరాన్ని ఒక గుడ్డతో బాగా తుడవాలి. ఎక్కువగా జ్వరం వచ్చిన వారిని చల్లని ప్రదేశంలో పడుకోబెట్టాలి.
అలాగే జ్వరం నుండి ఉపశమనం కొరకు పారాసెట్మాల్ మాత్రను మాత్రమే వెయ్యాలి.
డెంగీ రావడం వలన శరీరంలో ఫ్లేట్ లెట్స్ తగ్గుతాయి. ఇలా తగ్గడం వలన రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది. ఇలాంటి సమయంలో నొప్పుల ఎక్కువగా ఉన్నాయి అని ఎన్ఎస్ ఏఐడి ఉన్న మాత్రలు వాడకూడదు.
ఒకవేల ఫ్లేట్ లెట్స్ తగ్గిపోయినప్పుడు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఫ్లేట్ లెట్స్ ఎక్కించాలి.
డెంగీ వచ్చినప్పుడు పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉన్న ద్రవాలను రోగికి ఇవ్వాలి.
క్యారెట్ జ్యూస్, చీనీ రసం, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగించాలి.
బొప్పాయి పండ్లు తినడం.
డెంగీ రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు
పరిసరాలను పరిశుభ్రముగ ఉంచుకొని ముఖ్యంగా దోమలు రాకుండా నివారించాలి. కాయిల్స్, లిక్విడ్ లాంటివి వాడాలి. దోమ తెరలను వాడితే ఇంకా మంచింది.