చిన్నవయసునందె చిత్తాలు రంజించు
పద్య తతులు నేర్చి పలుక వలయు
పద్య ధారణమ్ము ప్రతిభను పెంచును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
తాత్పర్యం:
చిన్న వయసులో ఎన్నో రకాల పద్యాలు నేర్చుకొని పదే పదే పలుకుతూ ఉండాలి. పద్యాలు నేర్చుకొని గుర్తు పెట్టుకోవడం వల్ల ప్రతిభ పెరుగుతుంది. తెలుసుకుని మసులుకో ఓ తెలుగు బాల.